పల్లెల్లోకి అధికారుల బృందం
“ప్రజా పాలన
ప్రగతి ప్రణాళిక”
సిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్
కరీంనగర్ అక్షిత బ్యూరో :
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” సన్నాహక సమావేశంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ మాట్లాడుతూ.. 99 రోజుల పాటు చేపట్టనున్న “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమానికి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, నిర్వహించనున్న సభలపై ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. వార్డు, గ్రామాల వారీగా ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి గ్రామ సభల్లో వివరిస్తామని అన్నారు. రోజువారీగా, కార్యక్రమం వారీగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన అన్ని కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తామని, 99 రోజుల్లో జిల్లాలో ఒక గొప్ప మార్పు తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించడం, నిర్మాణంలో వారి సమస్యలు పరిష్కరించడం, స్వయం సహాయ సంఘాల మహిళలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేయనున్నామని అన్నారు.