నారాయణపూర్ కుడి ఎడమ కాలువ పూర్తిచేయాలి
20 కోట్ల రూపాయలు విడుదల చేయండి..
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంత్రులకు విజ్ఞప్తి..
కరీంనగర్, అక్షిత బ్యూరో :
నారాయణపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ కుడి ఎడమ కాలువ పనులు పూర్తి చేయాలని ఇందుకోసం 20 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. గతంలో 23 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. మెట్ట ప్రాంత రైతంగం సాగునీటి బాధలు తీర్చేందుకు ఈ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు. అదేవిధంగా కరీంనగర్ టు జగిత్యాల నేషనల్ హైవే రోడ్డు పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. అందుకు సంబంధించిన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
చొప్పదండిలో సెంట్రల్ లైటింగ్ వర్క్ పనులు నడకన సాగుతున్నాయని వేగవంతం చేయాలని కోరారు. అదేవిధంగా కొండగట్టు అభివృద్ధికి నిధులు బడ్జెట్లో కేటాయించాలని సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇటీవల చొప్పదండి నియోజకవర్గం లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఏటిసి పనులు డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.