పసునూరు మోడల్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహిళలు సమాజ నిర్మాణానికి పునాది
మహిళలకు సమాన హక్కులు గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత
మహిళా విద్యతోనే సమాజాభివృద్ధికి సాధ్యం
ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
మహిళల గౌరవంతోనే సమానత్వ సమాజ నిర్మాణం సాధ్యం
పసునూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ బల్గూరి చంద్రబాబు
నాగారం అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని పసునూరు గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల గౌరవం, సమాన హక్కులు, మహిళ సాధికారత వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బల్గూరి చంద్రబాబు మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఒక మంచి సమాజానికి, మంచి కుటుంబ వ్యవస్థకు మహిళలు పునాది అని అన్నారు. ఒక తల్లి చేతిలోనే పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని, అందువల్ల మహిళలను గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించినట్టేనని తెలిపారు. మహిళలు కుటుంబ వ్యవస్థను నిలబెట్టడంలో మాత్రమే కాకుండా విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతిక రంగం, రాజకీయాలు, క్రీడల వంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారని తెలిపారు. ఒకప్పుడు అనేక అడ్డంకులు ఎదుర్కొన్న మహిళలు నేడు అని రంగాల్లో ముందంజలో నిలుస్తూ దేశాభివృద్ధిలో తీరగా భాగస్వాములుగా మారారని అన్నారు. భారతదేశ చరిత్రలో అనేకమంది మహానీయ మహిళలు తమ ధైర్యం, త్యాగం, పట్టుదలతో సమాజానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. నేటి యువత ఆ మహానీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే వారు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని అన్నారు. మహిళల పట్ల గౌరవం చూపడం, వారికి సమాన హక్కులు కల్పించడం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళ విద్యకు అత్యంత నమస్తే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఒక మహిళ చదువుకుంటే కుటుంబం మాత్రమే కాదు, మొత్తం సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరు మహిళా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సమానత్వ భావనతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రముఖ మహిళా మహానీయుల జీవిత గాథలను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. మహిళలు ఎదుర్కొన్న సవాళ్లు, వారు సాధించిన విజయాలు, వారి ధైర్యం మరియు పట్టదల గురించి వివరించి అందరిని ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మహిళల గొప్పతనాన్ని తెలియజేసే కవితలు, పాటలు మరియు నాటికలను ప్రదర్శించారు, విద్యార్థుల ఈ ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళల గౌరవం, సమాన హక్కులు మరియు మహిళ సాధికారత వంటి అంశాలను ప్రతిబిమించేలా ఉపాధ్యాయులు,విద్యార్థులు కలిసి మహిళల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ వారికి గౌరవం తెలపడం ద్వారా సమానత్వంలో కూడిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సాధన, రాధా, హసీనా, సుమారాణి, తిరుమల వెంకటరమణ, హాస్టల్ స్టాప్ లత, గౌరీ, అటెండర్స్ త్రివేణి, కలమ్మ, కుక్సు మల్లమ్మ, అనిత, నాగమణి, అనూష, ఉపాధ్యాయులు బాలరాజు, లింగరాజు, రవి, సోమ సుందర్, కృష్ణ, నాగరాజు, వీరన్న, అశోక్, పిడి మహేష్, నరేష్, కలింగయ్య, మహేష్, వెంకన్న, లింగయ్య, శ్రావణ్, సాయిరాం, ఎల్లయ్య, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.