*యాదిరెడ్డి బండలో ఎమ్మెల్యే వివేకానంద్ పర్యటన*
*మౌలిక వసతుల అభివృద్ధికి మరింత కృషి చేస్తాం*
అక్షిత న్యూస్ / గాజులరామరం : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించే లక్ష్యంతో బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ గురువారం పేట్ బషీరాబాద్ పరిధిలోని రంగారెడ్డి బండ ప్రాంతంలో పర్యటించారు. అధికారులు మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రాంతాన్ని సందర్శిస్తూ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే నేరుగా వినిపించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు విద్యుత్ స్తంభాల మార్పు, భూగర్భ డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచడం, మంజీరా నీటి సరఫరాను పెంచడం వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలను గమనించిన ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు గత 12 ఏళ్లుగా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలతో పాటు యాదిరెడ్డి బండ వంటి బస్తీలలో కూడా కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా మౌలిక వసతులను మరింత మెరుగుపరిచి ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. పర్యటనకు ముందు స్థానిక కట్టమైసమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీకాంత్, ఏఈ జ్ఞానేష్, వాటర్ వర్క్స్ మేనేజర్ శివప్రసాద్, స్థానిక సంక్షేమ సంఘం నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.