సరికొత్త డిజైన్లు   సరసమైన ధరలు

సరికొత్త డిజైన్లు
   సరసమైన ధరలు

నాణ్యతలో మేటి
   మాకెవ్వరు సాటి

మంత్రి పొంగులేటి

   ప్రముఖ సినీ నటి శ్రీలీల

ఖమ్మంలో మాంగళ్య షాపింగ్ మాల్ 30వ శాఖ ఘన ప్రారంభం

ఖమ్మం, అక్షిత బ్యూరో :

సరికొత్త డిజైన్లు..సరసమైన ధరలు. స్వంత హ్యాoడ్లూమ్ తో నాణ్యతలో మేటిగా… మాకెవ్వరు సాటిగా వినూత్న డిజైన్లతో వస్త్ర ప్రపంచంలో మాంగళ్య షాపింగ్ మాల్ తనదైన శైలిలో ముద్ర వేసుకొని కస్టమర్ల ఆదరణ చూరగొంటుంది.

తొలుత ఒక మాల్ తో అడుగిడి దశాబ్దంన్నర కాలంగా 30 మాల్స్ తో వస్త్ర ప్రపంచంలో మాంగళ్య షాపింగ్ మాల్ కస్టమర్లకు మరింత చేరువైంది. 2012లో తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది. ఈ క్రమంలో ఖమ్మంలో 30 వ శాఖను ఘనంగా ప్రారంభించింది.

 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో దశాబ్దాల అనుభవంతో నాణ్యమైన వస్త్రాలను అందిస్తూ మూడు రాష్ట్రాల ప్రజలకు విశేష సేవలందిస్తున్న మాంగళ్య యాజమాన్యం పిఎన్ మూర్తి, కాసం నమఃశివాయ బ్రదర్స్ కలిసి కృష్ణార్జునుల లాగా వ్యాపారం చేస్తున్నా వారికి మా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో తమిళనాడు రాష్ట్రంలో విస్తరించనున్నారని పేర్కొన్నారు.

ఆ తర్వాత ప్రముఖ సినీ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా హాజరై, దీప ప్రజ్వలన చేసి మాల్‌ను ప్రారంభించారు. అనంతరం మాల్‌లోని వివిధ విభాగాలను సందర్శించి, అభిమానులతో సంతోషంగా మమేకమయ్యారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.
రిబ్బన్ కటింగ్ అనంతరం నటి శ్రీలీల మాట్లాడుతూ,


“ఖమ్మం ప్రజలు మాంగళ్య షాపింగ్ మాల్‌కు మంచి ఆదరణ అందిస్తారని నమ్మకం ఉంది. వారి ఆశీర్వాదాలతో ఈ మాల్ మరింత విజయవంతమవుతుంది” అని అన్నారు.మాంగళ్య షాపింగ్ మాల్ డైరెక్టర్లు పుల్లూరు నరసింహ మూర్తి, కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ “ప్రతి వర్గానికి, ప్రతి సందర్భానికి అనువైన నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందించడమే మా విజయ రహస్యం” అని తెలిపారు.


• “మా స్వంత హ్యాండ్‌లూమ్ ఉత్పత్తులను ఆధునిక మార్కెట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా డిజైన్ చేసి, వస్త్ర వ్యాపారంలో ముందంజలో కొనసాగుతున్నాం” అని పేర్కొన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్‌లో మహిళలు, పురుషులు, యువత, పిల్లల కోసం తాజా ఫ్యాషన్ కలెక్షన్స్, అలాగే వివాహాలు, శుభకార్యాలకు ప్రత్యేకమైన భారీ వెడ్డింగ్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మాల్ ప్రారంభంతో ఖమ్మం జిల్లా ప్రజలు ఇకపై పెళ్లి షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ ప్రాంతంలోనే నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చు. రూ.99 నుంచి ప్రారంభమై రూ.1 లక్ష వరకు ధరల శ్రేణిలో వస్త్రాలు అందుబాటులో ఉండటంతో పాటు, మాంగళ్య ఒక సంపూర్ణ ఫ్యామిలీ షాపింగ్ మాల్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మాంగళ్య షాపింగ్ మాల్, రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 9–10 కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనుండగా, భవిష్యత్తులో తమిళనాడు రాష్ట్రానికి కూడా విస్తరించనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల విశ్వాసాన్ని పొందిన మాంగళ్య షాపింగ్ మాల్, పాన్ ఇండియా స్థాయిలో నంబర్ వన్ షాపింగ్ మాల్‌గా నిలుస్తోంది.
ఖమ్మం జిల్లా ప్రజలు తమ తమ శుభ కార్యక్రమం ఏది ఉన్న ఒకసారి మాంగళ్య షాపింగ్ మాల్ కు సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఒక నూతన షాపింగ్ ఒరవడి సృష్టించాలని యాజమాన్యం తెలిపింది, ఈ కార్యక్రమంలో డైరక్టర్లు విశాల్, వరుణ్, కార్తిక్, అరుణ్, పనీత్, సాయి కృష్ణ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking