చిన్నారులే… పంతులైన వేళ

లక్ష్మాపురం అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు కీలకపాత్ర

పిల్లలకు పోషకాహారం ప్రాథమిక విద్య అందించడమే అంగన్వాడి లక్ష్యం

లక్ష్మాపురం గ్రామ సర్పంచ్ గుగులోత్ రవీందర్ నాయక్

నాగారం, అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో స్వపరిపాలన దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం, గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గుగులోతు రవీందర్ నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి స్వపరిపాలన భావన ఎంతో ముఖ్యమని అన్నారు. గ్రామ ప్రజలు తమ గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటేనే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామపంచాయతీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి బి. గోపి మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందించేందుకు గ్రామపంచాయతీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ ప్రజలకు చేరవేయడం తమ బాధ్యత అని అన్నారు. గ్రామ పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడం, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో గ్రామ ప్రజలు కూడా గ్రామపంచాయతీతో కలిసి సహకరించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. అంగన్వాడి కార్యకర్త మల్లెపాక కవిత మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. పిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్య మరియు ఆరోగ్య అవగాహన అందించడం ద్వారా వారి భవిష్యత్తును బలోపేతం చేయడమే అంగన్వాడీ కేంద్రాల లక్ష్యమని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించి అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, విద్య మరియు పోషణ పై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఆయా కుంటపెల్లి లింగమ్మ అంగన్వాడి చిన్నారులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking