మొబైల్ ఫోన్ల రికవరీ

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ

మందమర్రి, అక్షిత ప్రతినిధి :

 

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో గుర్తించి పెద్ద సంఖ్యలో రికవరీ చేయడం జరిగిందని ఎస్‌ఐ జె. శ్రీధర్ తెలిపారు. రికవరీ చేసిన ఐదు మొబైల్ ఫోన్లను సంబంధిత యజమానులకు పోలీసులు అందజేశారు. తమ ఫోన్లు తిరిగి పొందిన యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.మొబైల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన సీఈఐఆర్ పోర్టల్ ఆపరేటర్ పి.సి.ఎం అఖిల్‌ను ఎస్‌ఐ జె. శ్రీధర్ అభినందించారు. అలాగే రికవరీ ప్రక్రియలో సహకరించిన ఐడి పార్టీ సిబ్బంది హెచ్‌.సి. కె. జంగు, పిసి వెంకటేష్‌లను కూడా ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జె. శ్రీధర్ మాట్లాడుతూ సీఈఐఆర్ పోర్టల్‌ను భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రవేశపెట్టిందని. మొబైల్ ఫోన్ పోయినప్పుడు లేదా దొంగిలించబడినప్పుడు, ఐఎంఈఐ నంబర్ ద్వారా ఈ పోర్టల్‌లో నమోదు చేసి ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చని చెప్పారు. ఒకసారి బ్లాక్ చేసిన తర్వాత ఆ ఫోన్ దేశంలోని ఏ నెట్‌వర్క్‌లోనూ పనిచేయదని
దీంతో పోలీసులు సులభంగా మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేయగలుగుతున్నారని అన్నారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తో పాటు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking