లక్ష్మాపురం ప్రగతికి అందరి భాగస్వామ్యం

లక్ష్మాపురంలో ఘనంగా గ్రామసభ 

గ్రామ అభివృద్ధి అంశాలపై విస్తృత చరిత్ర

ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారంకు హామీ

లక్ష్మాపురం  సర్పంచ్ గుగులోత్ రవీందర్ నాయక్

నాగారం, అక్షిత న్యూస్ :- మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో బుధవారం గ్రామసభ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ గుగులోతు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని మహిళలు, యువకులు, రైతులు సహా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు. ఈ గ్రామసభలో ముఖ్యంగా గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతి, అర్హుల ఎంపికలు పారదర్శకత, త్రాగునీటి సరఫరా, రహదారుల మరమత్తులు, సీసీ రోడ్లు, కాలువల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా లోపాలు వంటి అంశాలు విస్తృతంగా చర్చకు వచ్చాయి. గ్రామంలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి కొరకు ఉన్నట్లు ప్రజలు తెలియజేయగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుగులోత్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ గ్రామసభలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన వేదికలని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడానికి ఇవి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి తెలియజేయాలని, ప్రతి సమస్యను నమోదు చేసి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పారదర్శక విధానాలు పాటిస్తామని, ఎవరైనా అన్యాయం జరిగిందని భావిస్తే వెంటనే గ్రామపంచాయతీ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ముఖ్యంగా పింఛన్ల మంజూరు, అంగన్వాడి, రేషన్ సరఫరా, ఉపాధి హామీ పథకం పనులు సక్రమంగా అమలయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను వివరంగా తెలియజేస్తూ, తాగునీటి సరఫరా లోపాలు, రహదారుల దుస్థితి, చెత్త నిర్వహణలో లోపాలు, విద్యుత్ సమస్యలు, పింఛన్ల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ సమస్యలను సంబంధిత అధికారులు గమనించి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజల సహకారం అత్యంత అవసరమని, గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామ సభలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి బి. గోపి, గ్రామ ఉపసర్పంచ్ గండెల లలిత రాములు, వార్డు మెంబర్ లు మల్లెపాక వెంకటయ్య, తడకమళ్ళ శృతి మధు, శాగంటి వీరభద్రయ్య, సుంకరి భద్రమ్మ, సుంకరి లింగయ్య, జిపిఓ లింగయ్య, రేషన్ డీలర్ తడకమళ్ళ నాగమల్లయ్య, విద్యుత్తు లైన్ మెన్ దీగోజు విజయ్ కుమార్, అంగన్వాడీ కార్యకర్త మల్లెపాక కవిత, ఆశా కార్యకర్త మల్లెపాక శోభారాణి, విబికే మల్లెపాక వెంకటయ్య, సీనియర్ ఉపాధి హామీ మేట్ మల్లెపాక గిరిబాబు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గండెల ఉపేందర్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్పలపెల్లి ముత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మల్లెపాక యాకయ్య, తడకమల్ల మధు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదిల రామ్మూర్తి, మల్లెపాక వెంకన్న, మల్లెపాక సైదులు, తడకమల్ల మధుసూదన్, వెంకటయ్య, బాలరాజు, స్టాలిన్ కుమార్, మధు, సాయిబాబా, నవీన్, శివ, స్వరాజ్యం, రేణుక, పద్మ, మంజుల, బిక్షమమ్మ, చంద్రమ్మ, గ్రామపంచాయతీ సిబ్బంది బాలయ్య, సురేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking