ఐక్యతకు చిహ్నం..ఇప్తార్ 

ఐక్యతకు చిహ్నం..ఇప్తార్ 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ రంజాన్ ఇఫ్తార్ విందులో ఐక్యత సందేశం

ఖైరతాబాద్, అక్షిత ప్రతినిధి :

సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సిరిగిరి విజయకుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్  కె. శ్రీనివాస్ రెడ్డి, అదనపు డిజిపి  ఎంఎం భగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత సామరస్యం, సోదరభావం సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం యొక్క ప్రాముఖ్యతను వివరించి, ఉపవాసం ద్వారా మనసు పవిత్రమవుతుందని చెప్పారు. సమాజంలో ఐక్యత అవసరాన్ని ప్రస్తావిస్తూ, అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా అభివృద్ధి, ప్రజా సేవ, సామాజిక బాధ్యతలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, ప్రజల మధ్య ఐక్యత, శాంతి, భద్రతల విషయంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమైనదని ఎం ఎం. భగవత్  అన్నారు. జర్నలిస్టులు,  ముఖ్య అతిధులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని సోదరభావాన్ని పంచుకున్నారు.


సోదర భావానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు దోహదపడతాయని,హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సంక్షేమంతో పాటు,జర్నలిస్టుల కుటుంబాల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు, క్రిస్మస్ వేడుకలు, ఇఫ్తార్ విందులు నిర్వహిస్తున్నామని ప్రెస్ అధ్యక్షులు సిరిగిరి విజయకుమార్ రెడ్డి, కార్యదర్శి వరికుప్పల రమేశ్ తెలిపారు.

ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యుడు యూసుఫ్ బాబు స్వాగతం పలుకగా ప్రెస్ క్లబ్ కార్యదర్శి వరికుప్పల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షురాలు అత్తలూరి అరుణ, జాయింట్ సెక్రటరీలు చిలుకూరి హరిప్రసాద్, రమేష్ వైట్ల, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు ఎం ఏ. మాజిద్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, కార్యదర్శి రామసహాయం రవికాంత్ రెడ్డి కార్యవర్గ సభ్యులు ఎన్. శ్రీనివాస్ రెడ్డి, కస్తూరి శ్రీనివాస్, దయ్యాల అశోక్, అమిత్ భట్టు, ఉమా వర్మ, మర్యాద రమాదేవి, కల్యాణం రాజేశ్వరి, రచనా ముడుంబి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ సభ్యులు శుజాత్ అలీ, షరీఫ్ మొహమ్మద్, మొహమ్మద్ ఆజం ఖాన్ సాంప్రదాయ శాలువాలతో అతిథులను సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking