పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్…
సొంత తయారీతో వినియోగదారుల అభిరుచి మేరకు ఐదు వేల రకాల డిజైన్లు
సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో దరలు
నేడు కొనసాగనున్న జువెలరీ ఎగ్జిబిషన్….
సూర్యాపేట, అక్షిత ప్రతినిధి :
సొంత తయారీతో వినియోగ దారుల అభిరుచి మేరకు అందమైన డిజైన్లలో జ్యువలరీ తయారు చేసి అందుబాటు ధరల్లో అందించడమే కార్బన్ లాక్స్ జ్యువలరీ సిద్ధాంతమని బిజినెస్ కో- ఆర్డినేటర్ ముస్త్యాల కిషన్, జనరల్ మేనేజర్ మిహెర్ షా,స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం బాలాజీ గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్బన్ లాక్స్ జ్యువెలరీ రెండు రోజుల జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను వారు ప్రారంభించి మాట్లాడారు.

ఈ ఎగ్జిబిషన్లో అందమైన డైమండ్, గోల్డ్,సిల్వర్ జ్యువలరీతో పాటు దేవుళ్ళ విగ్రహాలు,కిరీటాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.సుమారు 5 వేల రకాల డిజైన్లతో అన్ని రకాల బంగారు ఆభరణాలను ఎగ్జిబిషన్ లో ఉంచామన్నారు.వినియోగదారుల అభిరుచి మేరకు వారు మెచ్చిన డిజైన్లలో ఆభరణాలు తయారు చేసే అందించడం జరుగు తుందన్నారు.సొంత తయారీ కావడంతో పేద,మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించి అందిస్తున్నట్లు తెలిపారు.జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు కొనసాగే జ్యువలరీ ఎగ్జిబిషన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు. కార్బన్ లక్స్ జ్యువెలరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.