రైస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మూడు నెలల ఉచిత కుట్టు శిక్షణ పూర్తి
యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సహకారంతో నిర్వహణ
30 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు ధ్రువపత్రాల పంపిణీ
మహిళలు స్వయం ఉపాధి సాధించాలి
నాగారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. చిరంజీవి
నాగారం అక్షిత న్యూస్ :- మండల కేంద్రంలో రైస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సహకారంతో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గత మూడు నెలలుగా కొనసాగిన ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు మరియు శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్. చిరంజీవి హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళ తాను నేర్చుకున్న నైపుణ్యాలను వినియోగించుకొని స్వయం ఉపాధి సాధించాలని, ఆర్థికంగా బలపడాలని సూచించారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి కుటుంబాభివృద్ధికి తోడ్పడాలని, భవిష్యత్తులో మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే నేర్చుకునే విద్యలో నైపుణ్యం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తెలిపారు. రైస్ సంస్థ కోశాధికారి నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మహిళలు కేవలం పుట్టు పనిలోనే కాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడంలో మహిళ పాత్ర కీలకమని, పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. సంస్థ వ్యవస్థాపకులు మొగుళ్ల అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ 2009లో ప్రారంభమైన ప్రైస్ స్వచ్ఛంద సంస్థ గ్రామీణ మరియు పట్టణ పేద ప్రజల అభివృద్ధి కోసం విద్య, జీవనోపాధి, వ్యవసాయం, వైద్యం, వికలాంగుల ఉపాధి వంటి పలు రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 730 మందికి పైగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేసినట్లు తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు తమ అనుభవాలను పంచుకుంటూ ఈ కార్యక్రమం తమ జీవితములో మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొందగలమని, ఆర్థికంగా స్వావలంబన సారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైస్ స్వచ్ఛన సంస్థ మరియు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, కో-ఆర్డినేటర్ రమేష్, శిక్షకురాలు శోభ, శ్వేత, ఎల్మకంటి సోమయ్య, పవన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.