నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
రైతు ఏడిస్తే రాజ్యం నిలవదు..వ్యవసాయంపై కీలక వ్యాఖ్యలు
వివక్ష ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేసేవాళ్లం కాదు రేవంత్
సిద్దిపేటలో రాజకీయ మార్పు అవసరం
కాంగ్రెస్ గెలిస్తే సిద్దిపేట ఎమ్మెల్యేకు మంత్రి పదవి హామీ
పరిశ్రమల ఏర్పాటులో సిద్దిపేటకు మొదటి ప్రాధాన్యం
ప్రతిభకు ప్రపంచం తలవంచుతుంది యువతకు దిశా నిర్దేశం
ప్రైవేట్ విద్యపై ఆధారపడొద్దు
ప్రభుత్వ విద్యపై దృష్టి పెట్టాలి
బంగారం ధర పెరిగినా పసుపుకు న్యాయం లేదు రైతుల సమస్యలపై స్పందన
రైతుల్లో చైతన్యం అవసరం: ప్రభుత్వం సూచన
మిల్లెట్స్, ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారించాలి: సీఎం
అంకాపూర్ ఆదర్శం
వ్యవసాయ అభివృద్ధికి కేరాఫ్
సిద్దిపేటపై వివక్ష లేదు: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
రైతు సంక్షేమమే లక్ష్యం… 45 రోజుల్లో రైతు భరోసా నిధులు
మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం
రాజకీయాలు ఎన్నికలకే పరిమితం… అభివృద్ధిలో రాజకీయాలకు చోటు లేదు
సిద్దిపేట, అక్షిత బ్యూరో :
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆయిల్ ఫామ్ పరిశ్రమను ఆదివారం ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లావ్యాప్తంగా సాగుతున్న పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లిలో రూ. 15 కోట్ల వ్యయంతో నిర్మించిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని, అలాగే రూ. 3.60 కోట్లతో ఏర్పాటు చేసిన నూతన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు.వీటితో పాటు నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో రూ. 1.43 కోట్లతో నిర్మించిన పిహెచ్‌సి భవనాన్ని, సిద్దిపేట పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో రూ. 1.43 కోట్లతో నిర్మించిన యూపీహెచ్‌సి భవనాన్ని ఆయన ప్రారంభించారు.గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో రూ. 200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

అలాగే మర్కుక్ మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో రూ. 16.62 కోట్లతో చేపట్టనున్న అదనపు భవనాలు,మౌలిక సదుపాయాల పనులకు వర్చువల్ గా ప్రారంభించారు.ఎన్సాన్ పల్లిలో రూ. 78 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక జిల్లా జైలు భవనం, జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో రూ. 9.65 కోట్లతో నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయం,సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ. 141.34 కోట్ల భారీ వ్యయంతో యుఐడిఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ,నీటి సరఫరా ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ… సిద్దిపేట నియోజకవర్గంపై ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు తమకు సమానమని పేర్కొన్నారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని, రైతుల కష్టాలు బాగా తెలుసునని సీఎం పేర్కొన్నారు. పరోక్షంగా మాజీ సీఎం చంద్రశేఖర్ రావు మాజీ మంత్రులు హరీష్ రావు, కె టి ఆర్ లపై విమర్శలు చేశారు. తమకు రాజకీయ విభేదాలు ఉన్నా, ప్రజలపై ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. సిద్దిపేటలో మొదటి దశలో ఆయిల్ ఫామ్ పరిశ్రమను నిర్మించిన తర్వాతే, రెండో దశలో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో నిర్మిచాలి అని అడుగుతున్నాను అని అన్నారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు అని ఎన్నికలు పూర్తి అయిన తరువాత అభివృద్ధి ప్రాధాన్యం అన్నారు అలాగే మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఓడించాలి అని నేను కూడా వచ్చాను అని కానీ గెలిచిన తర్వాత కలిసి పనిచేసున్నాము అని చెప్పారు. 1984 నుంచి సిద్దిపేటలో ఒకే కుటుంబం పాలన సాగుతోందని వ్యాఖ్యానిస్తూ, 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ సిద్దిపేటలో ఎమ్మెల్యే గా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిగా చేసే బాధ్యత తుమ్మలకు, వివేకు ఇస్తున్నాను అని అన్నారు.

మల్లన్న సాగర్ సమస్యలపై స్పందిస్తూ, ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో 3500 ఇళ్లను మంజూరు చేసాము అని వివక్ష ఉంటే ఎందుకు చేస్తాము అని అన్నారు మీతో విబేధాలు ఉంటే పేద ప్రజలు ఎందుకు ఇబ్బంది పెడుతాము అని అన్నారు, మహిళలను ఆర్థికంగా బలపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని చెప్పారు.
రైతుల ప్రయోజనాలే మా లక్ష్యం
నర్మెట ఆయిల్ పామ్ ప్రారంభించిన అనంతరం వేదిక పైన రైతు భరోసా నిధులు మొదటి విడతగా 3,600 కోట్లను విడుదల చేశారు ఇవి 70 లక్షల మంది రైతులకు ఈ నిధులు అందనున్నాయని మొత్తం మరో 45 రోజుల్లో రెండు దశలవారీగా ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. గతంలో 9రోజులో 9 వేళా కోట్లు రైతుల ఖాతాల్లో వేసాము అని ఆర్థిక పరిస్తితి బాగా లేక విడతల వారిగా వేస్తున్నాము అని తెలిపారు. రైతులకు నష్టపరిహారం, బీమా వంటి పథకాల ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపారు.
రైతులు నానో యూరియా వినియోగంపై అవగాహన పెంచాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకమని రైతులకు పంట మార్పిడి చేయాలని కోరారు. విద్య వేవస్థ పై మాట్లాడుతూ పలు మార్పులు చేసున్నాము అని తల్లిదండ్రులు ప్రైవేటు విద్యపై మోజులో పడవద్దని సూచించారు. రాష్ట్రంలో 18 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో మహిళలకు భూమి కేటాయించి, వారి ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.