పోలీసుల – పాత్రికేయుల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్
కరీంనగర్, అక్షిత బ్యూరో :
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎస్ఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు, పాత్రికేయుల స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. సీఐ ప్రదీప్ కుమార్ మ్యాచ్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ ఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల కోసం పాటుపడే పోలీసులు,నిర్భయంగా ప్రజా సమస్యలు, అన్యాయాలను వెలికి తీసి ప్రభుత్వం ద్వారా పరిష్కరించడానికి కృషి చేసే పాత్రికేయులు వృత్తి రీత్యా బిజీగా ఉండడం జరుగుతుందని, రోజువారీ పనిలో ఒత్తిడి తగ్గించడానికి ఆటలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసం, స్నేహ భావాన్ని పెంపోందిస్తాయన్నారు.యువత మత్తు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, పాత్రికేయులు రవీందర్, వెంకటేష్, విజెందర్ రెడ్డి, శేఖర్, తిరుపతి, ప్రవీణ్, శ్రీనివాస్, కిషోర్, వెంకటరమణ, శ్రీనివాస్, స్కైలాబ్, సాగర్, అనిల్, అజయ్, శ్రీనివాస్, కుమార్, గుణశేఖర్, సంపత్, సాయికృష్ణ, వేణుమాధవ్, మాజీ జెడ్పిటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ వడ్లూరి సరిత శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ పెరుమాండ్ల మానస గంగయ్య, కౌన్సిలర్ లు రాజేందర్ రెడ్డి,ముద్దం రాజేశ్వరి తిరుపతి, ఓలుగోత్తుల సురేష్,వడ్లూరి అనూష శ్యామ్ లు పాల్గొన్నారు.