వ్యర్ధాలతో చింతలకుంట కంపు
దుర్వాసన..
దుండిగల్ సర్కిల్ లో పారిశుద్యం పడకేసినట్లేనా..?
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి పేరుకే నా ఇదేనా ప్రజా పాలన అంటూ ప్రశ్నిస్తున్న ప్రజలు..
పేపర్ల వరకే ప్రజా పాలన..ఫోటో షూట్ కోసమే ప్రజా పాలన కార్యక్రమాలు అంటున్న ప్రజలు..
99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఒక వైపు
కాలనీల్లో సమస్యలు మరో వైపు..
సాక్షాత్తు మేడ్చల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఊర్లోనే అమలు కానీ ప్రజా పాలన..
మేడ్చల్, అక్షిత బ్యూరో:
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి తడి పొడి చెత్త స్వచ్ఛ సర్వేక్షన్ ప్రజాపాలన కార్యక్రమాలు గ్రేటర్ హైదరాబాద్ లో అట్టాసంగా నిర్వహిస్తున్నారు, కానీ సైబరాబాద్ కార్పొరేషన్ పరిది కుత్బుల్లాపూర్ జూన్ దుండిగల్ జిహెచ్ఎంసి సర్కిల్ లో మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది అధికారుల పనితీరు ఇలా అని,వాపోతున్నారు,ప్రజలు.తెలంగాణ ప్రభుత్వం అధికారులంతా ప్రజాక్షేత్రంలో ఉండి సమస్యలు పరిష్కరించాలని తృడ నిశ్చాయంతో ముందుకు వెళ్తున్నా కొంతమంది అధికారులు ఒక ప్రక్కన దోమల బెడుద పై పట్టింపు లేనట్టేనా.. అధికారుల నిర్లక్ష్యంతో దుండిగల్ డి,పోచంపల్లి చింతల కుంట వద్ద వృద్ధాలతో కంపు దుర్వసన తో స్థానిక ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు.ఈ ప్రాంతంలో డ్రైనేజీ నీరు చింతల కుంట లోకి వెళుతుండటం తో దుర్గంధం తాండవం చేస్తుంది.ఈ సమస్య ను స్థానికులు దుండిగల్ సర్కిల్ అధికారుల దృష్టికి తీసుకుని వచ్చిన ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోయారు.
చింతల కుంటకు సుందరీకరణ కోసం 12కోట్లు కేటాయించారాని అంటున్న అవేమి అమలుకు నోచుకో లేదని విమర్శలు వెలువెత్తు తున్నాయి.
*జిల్లా గ్రంధాలయం చైర్మన్ ఊర్లోనే అమలు కానీ ప్రజా పాలన*
అధికారం ఉన్న ఆమాత్యులుగానే ఉండి పోయారు కాంగ్రెస్ నాయకులు.దుండిగల్ జిహెచ్ఎంసి సర్కిల్ పరిధి డి, పోచంపల్లిలో జిల్లా గ్రంధాలయం చైర్మన్ ఉన్న ఊరు లోనే ప్రజా పాలన అమలు కావటం లేదని సమాచారం.అధికారులు ప్రజా సమస్యలు పరిష్కారం చెప్పట్టడం లో పూర్తిగా విఫలం అయ్యారని ప్రజలు మండి పడుతున్నారు.

చింతల కుంటలో ప్రయాణికులు,స్థానికులు దుర్వసన తో ఇబ్బందులు పడుతున్న స్థానిక అధికారులు పట్టించుకోవటం తో స్థానికులు కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు.ఇప్పటి కయినా సంబంధిత అధికారులు సీట్ లకే పర్మితం కాకుండా ప్రజా క్షేత్రం లోకి వెళ్లి ప్రజా ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు.
కుత్బుల్లాపూర్ జోనల్ పరిధిలోని దుండిగల్ సర్కిల్ డి పోచంపల్లి లో దుర్గంధంతో ప్రజలు అష్ట కష్టాలు. 99 రోజుల పాలన ఒకవైపు జరుగుతుంటే మున్సిపల్ సర్కిల్ అధికారుల నిర్లక్ష్యం వలన చెరువు వద్ద వ్యర్ధాలు చేరిన శానిటేషన్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.