విశ్వసనీయతకు
చుక్కాని.. “రాజా”
రాజాకు సీతక్క ఆశీస్సులు
పదహరేళ్ళ పండుగకు
మంత్రి సీతక్క
గజమాలతో మంత్రి
సీతక్కకు సత్కారం
తార్నాక, అక్షిత ప్రతినిధి :
నమ్మకం..విశ్వసనీయతకు ఓ చుక్కాని. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ కు పదహారేళ్లు నిండాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా రియల్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ తమదైన ముద్ర వేసుకుంది. 16 వసంతాల్లో వేలాది మంది స్వంతింటి కలను సాకారం చేసింది. ఆయా ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులకు గణనీయమైన విలువలను పెంచింది. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తార్నాక కార్పొరేట్ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి.

ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. తొలుత మంత్రి సీతక్కకు రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు భారీ గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం 16 వసంతాలకు సాదృశ్యంగా కేక్ ను కట్ చేసి రాజు దంపతులను శాలువాలతో మంత్రి సత్కరించారు.

ఉత్తమ ప్రతిభ కనపర్చిన ఎంప్లాయిస్ కి మెమొంటోలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 16 సంవత్సరాలు నమ్మకంగా ఒక సంస్థ నడిపించడం అసాధ్యం కానీ రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ పౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు దాన్ని సుసాధ్యం చేశారన్నారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కోటిoరెడ్డి వినయ్ రెడ్డి, ద సియాసిత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్, తెలుగు ఫిలిం యాక్టర్ పృధ్విరాజ్, ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ సమీ ఆధర్, నల్గొండ డిఎస్పి నగేష్, మాతాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజు, అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ యం, లెజెండ్ టీవీ డైరెక్టర్ మాధవి, చరీష్ ఫౌండేషన్ డైరెక్టర్ డేవిడ్, విజయ భాస్కర్, ప్రవీణ్, జాన్, వైఎన్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత నరేందర్, సీఈవో మొరిగాల రేణుక, కావలి వెంకటేశ్, కానుకుర్తి వినయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు దేవేందర్, తాజ్, అక్షిత్, డాలి, నోరా, రోవన్, జాస్మిన్, విలియం, రాజా ఇన్ఫ్రా డెవలపర్స్ ఉద్యోగులు, రజిని, నీరజ, స్నేహ, రాజు, మస్తాన్, పవన్, ప్రవీణ్, వరంగల్ బ్రాంచ్ డైరెక్టర్ రామకృష్ణ, ఆంధ్ర తెలంగాణ నుండి చాలామంది ఆత్మీయులు పాల్గొన్నారు.