లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
చేర్యాల, అక్షిత ప్రతినిధి: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహకారంతో, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అందె నాని బాబు ఆధ్వర్యంలో చేర్యాల మండల పరిధిలోని ఆకునూరు గ్రామానికి చెందిన అమరగొండ కిష్టయ్యకు 50,000 వేల రూపాయల చెక్కును మరియు ముస్త్యాల గ్రామానికి చెందిన మేడిపల్లి యాదయ్య కుమార్తె కటికల కళ్యాణి కి 60,000 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అందే నాని మాట్లాడుతూ పేదల పక్షాన నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ ఎస్సీ సెల్ నాయకులు మల్లిగారి నర్సింహులు, సోషల్ మీడియా విక్రమ్ సొంటే, భూపతి తదితరులు పాల్గొన్నారు.