ఒలంపియాడ్ పరీక్షల్లో అవార్డులను సాధించిన పంచతంత్ర విద్యార్థులు

ఒలంపియాడ్ పరీక్షల్లో అవార్డులను సాధించిన పంచతంత్ర విద్యార్థులు

చేర్యాల, అక్షిత ప్రతినిధి : గత నెల 15వ తేదీ నిర్వహించిన ఎక్స్పోరా ఒలంపియాడ్ పరీక్షల్లో మూడవ తరగతికి చెందిన ఎన్ భవ్యాన్స్ జిల్లా మొదటి బహుమతి మరియు ఏడో తరగతి చెందిన పి ప్రణయ్ రెండో బహుమతి సాధించారు. బుధవారం రవీంద్రభారతిలో ఈ బహుమతులను విద్యార్థులకు అందజేశారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చే మహా వేదికగా నిలిచిన ఎక్స్పోరా ఒలంపియాడ్ అవార్డుల వేడుక బుధవారం హైదరాబాదులోని రవీంద్ర భారతి లో అత్యంత ఘనంగా జరిగింది. విద్యార్థుల మేధస్సు ను ప్రోత్సహించే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ పరిపాలన సేవాధికారి ప్రజా నాయకుడు ప్రేనాత్మక ప్రసంగకర్త డాక్టర్ జయప్రకాష్ నారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పోటీ పరీక్షలు విద్యార్థుల యొక్క ఆలోచన శక్తిని పెంపొందిస్తాయని జ్ఞానం సాధన తోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం ప్రత్యేక అతిథిగా పాల్గొన్న భారత సైన్యానికి చెందిన లెఫ్ట్నెన్ కాల్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ కృషి ఉంటే ఏ లక్ష్యాన్ని అయినా సాధించొచ్చు అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ నౌకాదళ అధికారి వెంకటేశ్వరరావు మరియు మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాజు సంఘానికి విజేతలకు అవార్డులు అందజేశారు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking