తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

రామన్నపేట, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం నాయకులు ప్రభుత్వానికి పలు కీలక డిమాండ్లు వినిపించారు.ఉద్యమకారుల గుర్తింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఆదుకోవాలని, ఉద్యమకారులకు రూ.10 లక్షల మెడికల్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.అలాగే ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి రూ.10 వేల కోట్ల నిధులతో ఆదుకోవాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండలాధ్యక్షులు నోముల శంకర్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ చాంద్, మండల ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, ఉద్యమ నాయకులు ఎండి ఇమామ్, బోగారం మాజీ ఉపసర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking