పిల్లలకు చదువు అందించడం ద్వారానే ఉజ్వల భవిష్యతు
వరంగల్ సిపి
వరంగల్, అక్షిత బ్యూరో:
చదువు చెప్పించడం ద్వారా వారి భవిష్యత్తుతో పాటు చదువుకునే పిల్లల్లో ఆనందాన్ని చూడొచ్చుని వరంగల్ సీపీ తెలిపారు.సోమవారం ఫోర్ట్ వరంగల్ మండలంలోని గుంటూరు పల్లి మండల ప్రాథమిక పాఠశాల లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్ పోలీస్ కమిషనరేట్,ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటుక బట్టీలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలకు కమిషనర్ చేతుల మీదుగా ఎడ్యుకేషనల్ సామాగ్రి,యూనిఫార్మ్స్ పంపిణీ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేది పోలీసు వివిధ ప్రభుత్వ అధికారుల సమన్వయంతో జరుగుతుందనీ కార్యక్రమంలోనే భాగంగా స్కూలు బయట ఉన్న పిల్లలందరినీ గుర్తించి తప్పనిసరిగా స్కూల్లో చేర్పించాల్సిన అవకాశం ఉందని తెలిపారు.

అందులో భాగంగానే వివిధ రాష్ట్రాల నుంచి ఉపాధి కొరకు ఇటుక బట్టీలలో పనిచేస్తున్న కుటుంబాలలోని పిల్లలకు సరైన విద్యా అవకాశాలు లేకుండా ఉన్న 120 బాలలను గుర్తించి వారిని అందర్నీ పాఠశాలల్లో చేర్పించడం జరిగిందనీ. ఈ పిల్లలకు సరైన విద్య అందుటకు కు ప్రత్యేకమైన టీచర్స్ ను యూనిఫాం, బుక్స్ బ్యాగులు, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సహకారంతో ఇప్పించడం జరుగుతుందని ఇందుకుగాను పోలీసు విభాగాన్ని ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగాన్ని ,సంస్థ వారిని అభినందిస్తునట్లు తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, అడిషనల్ డీసీపీ రవి, మామునూరు ఏసిపి వెంకటేష్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, ఎస్సై సుధాకర్లు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను పనిలో చేర్చుకోరాదని అలా చేస్తే చట్టపరంగా శిక్షించబడతారని అన్నారు.
కార్యక్రమం లో సర్పంచి శ్రీకాంత్, నరేష్ ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ ,ప్రాజెక్టు కోఆర్డినేటర్లు బత్తుల కరుణ ,ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, ఐ,జే,ఎం కోఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్, సిడబ్ల్యుసి చైర్పర్సన్ వసుధ, డిసిపిఓ ఉమా, వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొని బాధిత చిన్నారులకు బడి బ్యాగులు ఇతర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు.