కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుని పదవికి రాజీనామా

వలిగొండ /అక్షిత న్యూస్:
వలిగొండ మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీకి సేవలు చేసినట్లు,కానీ కొన్ని నా వ్యక్తిగత కారణాల వల్ల పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.పార్టీకి పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు తను ప్రస్తుతం సిద్ధంగా లేనందున తను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.