సీ పి ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

సీ పి ఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి

టీజీ సిపిఎస్ ఇయు రాష్ట్ర కోశాధికారి సనాతన బాలస్వామి 

నాగర్ కర్నూల్ , అక్షిత ప్రతినిధి

నాగర్ కర్నూల్ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ పునరుద్ధరించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన టీజీ సిపిఎస్ ఇయు రాష్ట్ర కోశాధికారి సనాతన బాలస్వామి సనాతన బాలస్వామి మాట్లాడుతూ ఒకటి సెప్టెంబర్ 2004 నుండి ఉద్యోగాలు సంపాదించినటువంటి వారికి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ను బలవంతంగా వారిపై రుద్దారని , రిటైర్డ్ ఉద్యోగుల లేదా చనిపోయిన ఉద్యోగుల వారి కుటుంబాలు చాలా దౌర్భాగ్యమైనటు వంటి స్థితిలో ఉన్నాయని అన్నారు అంబేద్కర్ రచించినటు వంటి రాజ్యాంగం ప్రకారం ఉద్యోగులందరూ సమానమేనని వారికి సమానమైనటువంటి పెన్షన్ ఉండాలని రాజ్యాంగంలో రాయబడింది, దానికి భిన్నంగా కొంత మంది ఉద్యోగులకు పాత పెన్షన్ అని మరికొంతమంది ఉద్యోగులకు కొత్త పెన్షన్ అని ఉద్యోగులను కూడా పెన్షన్ రూపంలో వేరు చేయడం సరికాదన్నారు. అంతే కాకుండా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ 2025 కు తీసుకొని వచ్చి దాదాపు కోటి మంది పెన్షనర్ల జీవితాల్లో చీకటి నింపుతుందని ఈ సందర్భంగా అన్నారు. తక్షణమే కేంద్రం పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ 2025 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ కుమార్, సుబయ్య, జిల్లా నాయకులు సుదర్శన్ పాండు రామాంజనేయులు విష్ణు శివ కర్ణయ్య తదితర సిపిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking