హనుమాన్ ఆలయ అభివృద్ధికి పాటు పడుతా.కమిటీ అధ్యక్షులు కురువ మాణిక్యం.
వికారాబాద్ అక్షిత బ్యూరో:
అన్ని విధాలుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని కమిటీ అధ్యక్షులు కురువ మణిక్యం అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డు ధన్నారం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామస్తుల సమక్షంలో శ్రీ ఆంజనేయ స్వామి” ఆలయ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ అధ్యక్షుడు కురువ మాణిక్యం, ప్రధాన కార్యదర్శి దొడ్ల ఆనందం, కోశాధికారి తెలుగు లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు ఈ.యాదయ్య,ఈ. ప్రభాకర్ రెడ్డి, సి.మహిపాల్, ఎస్ జంగయ్యలను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానన్నారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.