స్వీయ గణన కార్యక్రమం ప్రారంభం

స్వీయ గణన కార్యక్రమం ప్రారంభం

వర్ధన్నపేట మార్కెట్ వైస్ చైర్మన్, రాయపర్తి సర్పంచ్‌ల వివరాల నమోదులో పాల్గొన్న తాసిల్దార్ శ్రీనివాస్

రాయపర్తి అక్షిత ప్రతినిధి ప్రతినిధి 

స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) కార్యక్రమం ఆదివారం ప్రారంభం కాగా రాయపర్తి తహసిల్దార్ ఎం. శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి , రాయపర్తి గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతిల వివరాల నమోదును తహసిల్దార్ శ్రీనివాస్ స్వయంగా వారి ఇండ్ల వద్ద పర్యవేక్షించారు కుటుంబ వివరాలు, ఆర్థిక, సామాజిక అంశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి, అవగాహన కల్పించారు. ఈ స్వీయ గణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ ఈ సందర్భంగా కోరారు. సరైన వివరాలు అందిస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావార్లు చంద్రమోహన్ , సంధ్యారాణి , ఎంపీఎస్ఓ కళ్యాణ్ , జీపీఓలు పూజారి సురేష్ , సంజీవయ్య , కారోబార్ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking