అమ్మవారి కటాక్షంతో ప్రజలకు మంచి జరగాలి
ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ఈదులపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ నూతన ఆలయ మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
షాద్ నగర్, అక్షిత ప్రతినిధి
షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ నూతన ఆలయ ప్రారంభోత్సవ మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కటాక్షంతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో నిండాలని,ప్రజలందరికీ ఆరోగ్యం,ఐశ్వర్యం,ఐక్యత కలగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఈదులపల్లి గ్రామ సర్పంచ్ సులోచన గణేష్ గౌడ్, మోత్కులగూడ సర్పంచ్ లావణ్య రమేష్,మోత్కులగుడ మాజీ సర్పంచ్ నరసింహులు, ఈదులపల్లి ఉపసర్పంచ్ సంధ్య శేఖర్,బీఆర్ఎస్ నాయకులు జయరాం గౌడ్,నర్సిములు గౌడ్,వార్డు మెంబెర్స్, కుమారస్వామి,రాలబండి అనూష శ్రావణ్ గౌడ్,శ్రీధర్ గౌడ్,జి.హనుమంత్ గౌడ్,మౌనిక ప్రవీణ్,బస్వ శేఖర్ మరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..