సర్పంచ్‌కు రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి..?

సర్పంచ్‌కు రక్షణ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి..?

రోబోలు వచ్చిన యుగంలో కూడా కుల దాడులా..?

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్

షాద్‌నగర్, అక్షిత ప్రతినిధి:

కంప్యూటర్ యుగంలోకి అడుగుపెట్టిన మన దేశంలో, రోబోలు వచ్చిన ఈ కాలంలో కూడా కులం పేరుతో దాడులు జరుగుతున్నాయంటే సమాజం ఇంకా ఎక్కడ ఉందో అర్థం చేసుకోవాలి అని ఉప్పరిగడ్డ సర్పంచ్ చందు నాయక్ సూచించారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చందు నాయక్ మాట్లాడుతూ చౌదరిగూడ మండలం ఎల్కగూడెం గ్రామ సర్పంచ్ బందెయ్యపై జరిగిన హత్యాయత్నం దారుణం, దారుణాలకు మించి జరిగిన దాడి అని తీవ్రంగా ఖండించారు. జాతర వేళ ఒక గ్రామ ప్రథమ పౌరుడిని కులం తక్కువని అవమానించడం, అడ్డుకోవడం, మారణాయుధాలతో వెంటాడి దాడి చేయడం చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు.“ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే, ఎనకటి కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అంటే నిందితులకు భయం లేకుండా పోయిందని, వెంటనే వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ, సర్పంచ్ బందెయ్యకు పూర్తి అండగా నిలుస్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కుల అహంకారానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న ఈ తరుణంలో ఇలాంటి కుల అహంకార దాడులు జరగటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking