దళారులను నమ్మి మోసపోవద్దు.. కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించండి
సన్న వడ్లకు రూ. 2,389 మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట అక్షిత ప్రతినిధి :
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నెక్కొండ మండలం గొట్లకొండ తండాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ సీజన్‌లో సన్నవడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ. 2,389 మద్దతు ధరతో పాటు అదనంగా రూ. 500 బోనస్‌ను అందిస్తోందని వెల్లడించారు. ఈ నిధులు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. గ్రామాల్లోకి వచ్చే దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకొని నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే తూకం వేయించుకొని గిట్టుబాటు ధర పొందాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగినన్ని గన్నీ బ్యాగులు, తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, ఎంపీడీఓ లావణ్య, ఏపీఎం కిరణ్ కుమార్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రజిత, జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్, నెక్కొండ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్, మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల శ్రీనివాస్, మాదటి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ, కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు పోలిశెట్టి భాను ప్రకాష్, చల్లా శ్రీపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివ, మార్కెట్ డైరెక్టర్లు రావుల మహిపాల్ రెడ్డి, బొమ్మేరాబోయిన రమేష్, దుడిమెట్ల కొమురయ్య, జిల్లా సభ్యుడు రాజు, యూత్ ప్రధాన కార్యదర్శి బోడ ప్రవీణ్, సోషల్ మీడియా కన్వినర్ రావుల తిరుపతి రెడ్డి, మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్, మహ్మద్ అన్వర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు వినయ కుమారి, సామ్య, జనార్దన్, భూక్యా రమేష్ రాథోడ్, బాధవత్ సూర్య, బానోత్ రవి కుమార్, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.