రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

–  జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యం 

–  అధ్యక్షుడు సంతోష్ కుమార్

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ (రిజిస్ట్రేషన్ నం. 332/2022) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మంగళవారం స్థానిక ఠాగూర్ స్టేడియం ఆవరణంలో నిర్వహించిన సమావేశంలో విలేఖరులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.మూడోసారి వరుసగా అధ్యక్షుడిగా మిట్టపల్లి సంతోష్ కుమార్ (విశాలాంధ్ర) ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా వేల్పుల కిరణ్ కుమార్ (ప్రజా ప్రతిభ), కోశాధికారిగా కూరపాటి శ్రీనివాస్ (టుడే టీవీ), ఉపాధ్యక్షుడిగా బద్రి సంతోష్ (క్రైమ్ మిర్రర్), సహాయ కార్యదర్శిగా గంజి సతీష్ (అక్షిత) ఎన్నికయ్యారు.కమిటీ సభ్యులుగా ఎరుకల బుచ్చిబాబు (సిటీ న్యూస్), ఎర్రవల్లి శ్రీనివాస్ (అక్షర విజేత), పిల్లి రవికిరణ్ (తెలంగాణ వాణి), మారేపల్లి సాయి కుమార్ (ఆర్టీఐ ఎక్స్‌ప్రెస్), డొలకల సంతోష్ (హైదరాబాద్ ఎస్టేట్) కొనసాగుతున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు మిట్టపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. జర్నలిస్టుల ఐక్యతే క్లబ్ బలమని, ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కలిసికట్టుగా పనిచేస్తేనే సమాజంలో మీడియాకు మరింత గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావడంలో ప్రతి విలేఖరి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ స్వతంత్రంగా కొనసాగుతుందని, క్లబ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా విలీనం పేరుతో తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రెస్ క్లబ్ పేరుతో విహారయాత్రల కోసం సహకారం కోరుతూ పట్టణంలో తిరుగుతున్న వ్యక్తులకు రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులను, అధికారులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking