రాజీవ్ తోనే సాంకేతిక విప్లవం

*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి*

*-చిత్రపుటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…

లోకేశ్వరం, అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ముధోల్ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్,అదేశానుసారం. మండల అధ్యక్షులు గడ్డం సుదర్శన్ రెడ్డి,లోకేశ్వరం గ్రామ సర్పంచ్ ధార్వాడి కపిల్,నాయకులు కార్యకర్తలు కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.ఈ దేశానికి టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసి,ఆధునిక భారత్‌కు పునాది వేసిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు.స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు.అలాగే ఓటు హక్కు యువ పరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా దేశంలో యువశక్తికి రాజకీయ ప్రాధాన్యతను పెంచిన మహానేత అని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ సోమ సుధీర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు మహ్మద్ షఫీ, మాజీ యూత్ అధ్యక్షులు విజయ్ రావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు మోడం నరేష్, రమేష్ గౌడ్, ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking