హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఎయిర్ ఇండియా బస్సు దగ్ధం

ఇబ్రహీంపట్నం అక్షిత ప్రతినిధి

ఎయిర్ ఇండియా బస్సులో అగ్నిప్రమాదం సంభవించిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ నుండి పెద్ద అంబర్‌పేట వైపు ఎయిర్ ఇండియా బస్సు ప్రయాణిస్తుంది. సరిగ్గా ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుకు చేరుకోగానే అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఅంబర్‌పేట సమీపంలోకి బస్సు రాగానే బస్సు నుంచి ఒక్కసారిగా పొగలు, మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా షార్ట్‌గా ఉన్న బస్సులో ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేయడం వలన పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం. ఈ ఘటనపై అధికారులు పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటనతో ఔటర్ సర్వీస్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking