సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులుగా దుడ్డు రాహుల్
దుడ్డు రాహుల్ నియమించిన కాంగ్రెస్ పార్టీ.
జిల్లా అధ్యక్షుని చేత,నియామక పత్రం అందుకున్న దుడ్డు రాహుల్
ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే కళాకారునిగా,నా బాధ్యత, దుడ్డు రాహుల్..
కుత్బుల్లాపూర్, అక్షిత ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షునిగా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నా నియామకానికి,సహకరించిన మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రెష్ యాదవ్ కుద్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హన్మంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు అన్న కి సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు దరువు అంజన్న కి ధన్యవాదాలు తెలుపుతూ నేడు జిల్లా అధ్యక్షులు వజ్రశ్ యాదవ్ చేతుల మీదుగా నియామాకా పత్రం అందుకున్న సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ నమస్కరిస్తూ గత 20 సంవత్సరాలుగా కళా రంగంలో కాంగ్రెస్ పార్టీ కోసం అనేక బహిరంగ సభలలో కవిగా గాయకునిగా సేవలందించిన తరుణంలో నాపై నమ్మకం ఉంచి జిల్లా ఆధాక్షునిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ పదవి వాళ్ళ నాపై ఇంకా బాధ్యత పెరిగింది అని భావిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాడమే కళాకారుణిగా నాబాధ్యత గా భావిస్తున్నాను మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని నన్ను జిల్లా ఆదాయక్షునిగా ఎన్నుకోవడానికి నాకు సహకరించిన తోటి కళాకారులకు పార్టీ నాయకులకు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ రాహుల్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా అధ్యక్షులు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొదమగుండ్ల అమృతయ్య, పోచంపల్లి బాలరాజు, కార్యనిర్వాహాక అధ్యక్షునిగా గాజ్జల రాంచందర్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో మిత్ర సంఘామైన ప్రజానాట్యమండలి జిల్లా కార్యనిర్వాహాక అధ్యక్షులు ప్రవీణ్,డప్పు రామస్వామీ, రాములు, పోతారాజు సోమయ్య, కొంగర నరహరి, సయ్యద్ జిలాని పాషా తదితరులు రాహుల్ కీ శుభాకాంక్షలు తెలిపారు.