ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఉద్యమకారుల సమావేశం

ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఉద్యమకారుల సమావేశం

తాండూరు, అక్షిత ప్రతినిధి:

హైదరాబాదులో ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు తెలంగాణ ఉద్యమ కారుల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి అధ్యక్షతన ఉద్యమ కారుల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఈ సమావేశానికి తాండూర్ ఉద్యమకారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే విధంగా ఉద్యమ కారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, గుర్తింపు ప్రతి ఉద్యమకారుడికి వచ్చే వరకు ఉద్యమించాలని, అన్నారు. త్వరలో కమిటీలు వేసి జిల్లా రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమకారుల సభలను నిర్వహిస్తామని, తెలిపారు. మూడు నెలల్లో ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు ఏ విధంగా అందిస్తాము చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించిందని, గడువులోపు ఉద్యమకారులకు న్యాయం చేయాలని, ఆయన అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోని శ్రీనివాస్, జిలాని, సంజయ్ గౌడ్, ప్రకాష్ గౌడ్, ఎస్ నాగేందర్, రొంపల్లి అశోక్, తెలంగాణ ఆర్టిఐ, మాజీ చైర్మన్ శంకర్ నాయక్, ఓయూ జేఏసీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking