ఆదివారం రోజు దర్జాగా కళాశాల నిర్వహిస్తున్న భాష్యం కళాశాల యజమాన్యం
– కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
– ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు
తాండూరు, అక్షిత ప్రతినిధి:
కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకో వాలని, ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నగర అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ.. ఆదివారం సెలవు రోజు అయి నప్పటికిని పరీక్షల పేరుతో ఆదివారం భాష్యం కళాశాల లో తరగతులు నిర్వహి స్తున్నారు అని మండి పడ్డారు. వారంలో ఒక్కరోజు వచ్చే సెలవు రోజును కూడా పని దినంగా నిర్వహిస్తున్న భాష్యం కళాశాలపై ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టు వ్యవ హరిస్తున్నారని, సంకల్ప్ పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేస్తున్నా కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ అధికారులకు విన్నవించు కుంటున్నమని తెలిపారు. సంకల్ప్ పేరుతో నిర్వ హిస్తున్న భాష్యం కళాశాలకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేనప్పటికి ప్రత్యేక తరగతుల పేరుతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా,
దర్జాగా కళాశాల నిర్వహిస్తు ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేస్తూ.. కళాశాలను నిర్వహిస్తున్న , అధికారులు చూసి చూడనట్టు వ్యవ హరిస్తున్నారు. కళాశాల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.
ముఖ్యంగా కళాశాల కరస్పాండెంట్ ఏబీవీపీ నాయకులను దుర్భాష లాడుతూ.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుర్మార్గ మన్నారు. ఈ కళాశాలలో నియమ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించడం కాకుండా విద్యార్థుల తల్లి దండ్రులతో విద్యార్థి సంఘం నాయకులతో వాగ్వాదం చేయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, ఏబీవీపీ ఆధ్వర్యంలో వాటిని ఎండ గడతామని, హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, నాయకులు నవీన్ గౌడ్, జాఫర్, భరత్, కార్తీక్, కౌతిఫ్, తదితరులు పాల్గొన్నారు.