ఎమ్మెల్యే పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం
– ఐఎన్టియుసి నియోజక వర్గ అధ్యక్షులు న్యాయవాది జిలాని
తాండూరు, అక్షిత ప్రతినిధి:
కొడంగల్ లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ లో తాండూర్ ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఉద్దేశించి, బుధవారం మనోహర్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి సరదాగా నవ్వుకుంటూ మాట్లాడిన.. సాధారణ వ్యాఖ్యలను రాజకీయంగా వక్రీకరించి, కావాలని అబద్ధపు ప్రచారాలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని, ఐఎన్టియుసి తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు, న్యాయవాది జిలాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న సేవలను చూసి కొందరు రాజకీయ స్వార్థంతో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, జిలాని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు కొనసాగితే.. ఐఎన్టియుసి తరఫున తగిన విధంగా స్పందిస్తామని, ఆయన స్పష్టం చేశారు.