కరీంనగర్ లో మరో భారీ దోపిడి
అర్ధరాత్రి దొంగల బీభత్సం
కరీంనగర్ అక్షిత బ్యూరో
కరీంనగర్ పట్టణ నడిబొడ్డున మరో భారీ దోపిడీ జరిగింది. కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో గల భగత్ నగర్ లో నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో వృద్ధుడు ఇంట్లోకి అగంతుకులు చొరబడి మారుణాయుధాలతో దాదాపు 8 మంది మాస్కులు గ్లౌజులతో ఇంట్లోకి చొరబడి దోపిడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో అజ్మత్ అలీ ఇంటి సందులోని లైట్ ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో ఆయన నోటిని మూసివేసి అతని పై దాడి చేశారు ముగ్గురు మహిళల నోట్లో గుడ్డలు కుక్కి తుపాకులతో బెదిరించి 66 తులాల బంగారం,10 తులాల వెండి,రూ. 22 లక్షల నగదు దోచుకెళ్లారు.ఈ క్రమంలో దోపిడీనీ ప్రతిఘటించిన అజ్మత్ అలీ పై దాడి చేశారు ఘటన స్థలంలో ఒక తుపాకీ లభ్యమైంది దానిని పరిశీలించగా ఆది బొమ్మ తుపాకీ గా తేలింది. దోపిడికి వచ్చిన వారంతో హిందీలో మాట్లాడుతున్నారని బాధితులు చెప్తున్నారు. ఇదంతా కూడా సంఘటన జరిగిన సమీప చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మీద అవగాహన ఉన్నవారు లేదా బంధువుల మధ్యలో ఉండొచ్చని అనుమానం వ్యక్తం అవుతుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోపిడి అనంతరం దుండగులు అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులు చోరీ చేసుకుని బైపాస్ రోడ్డు మీదుగా వరంగల్ పరారయ్యారని సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి చూస్తే ఇంటికి దుండగులు ఏలా చేరుకున్నారు. ఏదైనా వాహనంలో వచ్చారా లేదా అజ్మత్ అలీ ఇంటి సమీపంలో వాహనం దిగి వాహనాన్ని ఎక్కడైనా దూరంలో పార్క్ చేసి ఉంచారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.