భారతీయ జనతా పార్టీ యువజన మోర్చా “బీజేవైఎం” కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా సంగ నరేష
కరీంనగర్ అక్షిత న్యూస్
భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా చొప్పదండి పట్టణానికి చెందిన సంఘ నరేష్ ను నియమిస్తూ బిజెపి రాష్ట్ర శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేవైఎం నూతన అధ్యక్షులుగా నియమితులైన నరేష్ మాట్లాడుతూ జిల్లాలో బీజేవైఎం బలోపేతానికి, యువతలో దేశభక్తి , జాతీయతా భావం పెంపొందించడానికి సామాజిక సేవ లో యువతను భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తననియామకానికి సహకరించిన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు,కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి బండి సంజయ్, బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణా రెడ్డి ,కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ,డిప్యుటి మేయర్ సునిల్ రావు ,కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ ప్రవీణ్ రావు , బిజేవైయం రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ లకు రాష్ట్ర,జిల్లా పార్టీ పెద్దలకు, నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.