ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఏల బాధ్యత

ఓటు హక్కు పరిరక్షణ బిఎల్ఏల బాధ్యత

– బిఎల్ఏ లతో సమీక్ష సమావేశం

– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు, అక్షిత ప్రతినిధి:

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ బిఎల్ఏ లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని, సార్ పై బిఎల్ఏ లకు పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బిఎల్ఏ లు కీలకపాత్ర పోషిస్తున్నారు, మిగతా 10 రోజులు కూడా మీ పాత్ర కీలకంగా ఉండాలి సూచించారు. ఓటు హక్కు భారత రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. అర్హత ఉన్న ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి బిఎల్ఏ అప్రమత్తంగా పని చేయాలని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు సార్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ.. అవసరమైన దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయించాలన్నారు. ప్రతి బూత్, ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రజల ఓటు హక్కును కాపాడాలని, పిలుపు నిచ్చారు. ప్రజా స్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా ఎంతో కీలకమని, అన్నారు. ఈ బాధ్యతను ప్రతి కార్యకర్త నిబద్ధతతో నిర్వర్తించాలని, ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్య క్రమంలో టిపిసిసి సార్ పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సార్ కన్వీనర్ పురుషోత్తం రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking