రేపు జరిగే విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయండి
– ఢిల్లీలో విద్యార్థి యువతపై జరిగిన దాడిని ఖండిస్తూ
పిడి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు పి. శ్రీనివాస్
తాండూరు, అక్షిత ప్రతినిధి:
జూలై 24 తేదీన నీట్ పేపర్ లీకేజీ పైన ఢిల్లీలో జరుగుతున్న నిరసనలో భాగంగా ఢిల్లీలో విద్యార్థి యువతపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండి స్తున్నామని, గురువారం మీడియా సమావేశంలో పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా 24/జూలై/26/జరిగే బంద్ ను విజయవంతం చేయాలని, కోరారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెంటనే రాజీనామా చేయాలని, డిమాండ్ చేశారు. ఎన్టిఏ ను రద్దు చేయాలి, ఢిల్లీలో విద్యార్థి యువతపై జరిగిన దాడులపై పారదర్శకంగా విచారణ జరిపించాలని, డిమాండ్ చేశారు. దేశంలో విద్య కేంద్రీకరణ విధానా లను వెనక్కి తీసుకోవాలని, విబి ఎస్ఎ బిల్లును రద్దు చేయాలని, డిమాండ్ చేశారు.