రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మోలుగురి రవి 

రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మోలుగురి రవి 

గురువారం బాధ్యతలు చేపట్టిన మోలుగురి రవి 

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మోలుగురి రవి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన డీటీసీ జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లా నుండి రామన్నపేట సీఐ గా బదిలీ అయ్యారు. ఇక్కడ ఉన్న సీఐ ఎన్. వెంకటేశ్వర్లు మల్టీ జోన్ 2 కు రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా నూతన సీఐ మోలుగురి రవి మాట్లాడుతూ.. రామన్నపేట సర్కిల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking