జోకుడుకు మరిగిన జర్నలిజం

జోకుడుకు మరిగిన జర్నలిజం

 – కలంపై “కసాయి కీచకుల” దాడులు.

– జర్నలిజంలో ఆత్మగౌరవ పోరాటం ఎక్కడ.

– మోసగాళ్లపై మనదైన పదునెక్కడ.

– దేశంలో జరుగుతున్న ఆర్థిక దోపిడీని ప్రశ్నించండి.

 – పదునైన మీడియా దారులు బహుజనులే.

– సమాజాన్ని ప్రభావితం చేయగల జర్నలిజాన్ని చూడగలమా.

– ఆధునిక కాలంలో అంతరించిపోతున్న జర్నలిజం విలువలు

– నిజాయితీ గల జర్నలిస్టులకు నిలువెత్తు గర్వం ఉంటుంది.

– కేటుగాళ్లంతా జర్నలిజం ముసుగేసుకుంటున్నారు.

– జర్నలిస్టులం ప్రభుత్వాల దృష్టిలో ఎందుకు పలుచనవుతున్నాం.

– సూటి పోటీ దాడుల ముసుగులో జాడ లేకుండా పోతున్నామా.!

– నిజాన్ని నిర్ణయంగా చాటి చెప్పడానికి అడ్డంకులు ఎందుకు.

– మంచిని చెడును సమానంగా చూస్తే జర్నలిజం ఎలా అవుతుంది.

– జర్నలిజంలో విశ్వాసఘాతకులంతా బయటివాళ్లే.

– అరాచక శక్తుల “కీచక” ఆగడాలపై పోరాటాలు చేద్దాం.

జర్నలిజం అనేది సాధారణమైన వృత్తి కాదని సమాజాన్ని ప్రభావితం చేసే మహోన్నతమైన శక్తి అంటూ అభివర్ణించారు. సాహసవంతమైన జర్నలిజం చేయకపోతే సమాజంలో పలుచన అవుతామన్న సంగతిని ప్రతి జర్నలిస్టు గుర్తుకు పెట్టుకోవాలని సూచించారు. జర్నలిజాన్ని జర్నలిజం లాగా ప్రభావితం చేసే క్రమంలో మనవాడెవడో పరాయివాడెవడో పసిగడ్డ లేని పరిస్థితిలో నేటి జర్నలిస్టుల ప్రయాణం కొనసాగుతుందని జర్నలిజంలో కేటుగాళ్లంతా బయట నుండి చేరిపోతున్న బాపతు గాళ్లేనంటూ అలాంటి వాళ్లను గుర్తిస్తూ జర్నలిస్టులు ముందుకు  సాగాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే అణిచివేత

మొదలవుతుందో ఎక్కడైతే అరాచకాలు

సృష్టించబడతాయో ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా అవమానాలను ఎదుర్కొంటారో ఎక్కడైతే క్షేత్రస్థాయి అవినీతి జరుగుతుందో ఎక్కడైతే కేటుగాళ్లంతా ముఠాలుగా ఒక్కటై వ్యవస్థలను దోచుకుంటారో అలాంటి వాళ్లపై పోరాటాలు కొనసాగిస్తున్న జర్నలిస్టులు. అందరూ ధైర్య సాహసాలతో ముందుకు సాగాలని కోరారు. కేటుగాళ్ల ముఠాలు వాళ్లపై చేయుచున్న పోరాటాల్లో మనకన్నా ఎక్కువ వాళ్లే జర్నలిస్ట్ ముసుగు వేసుకొని సమాజాన్ని తప్పుదోవ పట్టించే క్రమంలో ఆస్తులు సంపాదించుకుంటూ అధికారం సంపాదించుకుంటూ సమాజాన్ని మోసం చేస్తూ వ్యవస్థలను వెక్కిరింతల పాలు చేస్తూ నాణ్యతలేని వ్యక్తులుగా నామరూపం లేని శక్తులుగా వెలుగొందుతూ వాళ్లకు వాళ్లే గొప్పోల్ల లాగా సొంత పత్రికలు సొంత టీవీలు పెట్టుకుంటూ బినామిదందాకు బందుత్వాన్ని పెంచి పోషిస్తున్నారని గుర్తు చేశారు. నిజం కోసం పోరాడేవాళ్లు ఆస్తుల సంపాదన పట్ల ఆరాటపడరని కేవలం కుటుంబ పోషణ గడిస్తే సరిపోతుందని జీవిత లక్ష్యాలను జర్నలిజంలో ప్రదర్శిస్తూ సమాజంలో అతికరుడుగట్టిన నిజమైన జర్నలిస్టులుగా ఎదుగుతారన్నది గుర్తుంచుకోవాలన్నారు. అదే సందర్భంలో కసాయి గాళ్లు కూడా జర్నలిస్టులమంటూ అవినీతి ముసుగును ధరించి జర్నలిజాన్ని ముఖంపై వేసుకొని రాళ్ళేమైనా తక్కువ అంటూ ముందుకు దూసుకు వస్తారంటూ గుర్తు చేశారు. నిజమైన జర్నలిస్టులు నిజమేదో అబద్ధం ఏదో పసిగట్టలేని దుర్మార్గమైన స్థితిలో వార్తలు రాయడం టీవీలలో ప్రసారాలు చేయడం దేనికోసం అంటూ సమాజం ప్రశ్నించడాన్ని ఇంకా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుత జర్నలిజంలో 15 నుండి 20 సంవత్సరాల పైబడి జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులు నీతి నిజాయితీ నియమాలతో ముందుకు సాగుతున్నారని కొత్తగా వచ్చిన జర్నలిస్టులు కేవలం కేటుగాళ్లను బ్రోకర్ గాళ్లను కసాయికాలను అవినీతిపరులను భూకబ్జాదారులను అక్రమార్కులను వ్యవస్థ నాశనదారులను సమాజ వ్యతిరేక శక్తులను సంఘవిద్రోహశక్తులను రక్షించడం కోసం వాళ్లకు సహకరించడం కోసం మాత్రమే జర్నలిజం ముసుగు వేసుకుంటున్నారని అలాంటి వాళ్ళతో సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉందన్న సంగతిని మర్చిపోవద్దన్నారు. జర్నలిజం అంటే అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలని, జర్నలిజం అంటే అక్రమార్కులు అడుచుకోవాలని, జర్నలిజం అంటే కేటుగాళ్లంతా కళ్ళు తెరుచుకోవాలని, జర్నలిజం అంటే కసాయి గాళ్లు అడుచుకోవాలని, జర్నలిజం అంటే అన్ని ప్రభుత్వ శాఖల లోని అవినీతి అక్రమార్క అధికారులకు వణుకు పుట్టాలని, జర్మలిజం అంటే రాజకీయ నాయకులు తప్పు చేయాలంటే భయపడాలని, ప్రజలను మోసగించాలంటే జర్నలిస్టులు వెంటాడుతారనే భయాన్ని పుట్టించాలని గుర్తు చేస్తూ నిజమైన జర్నలిజాన్ని మనస్ఫూర్తిగా ప్రభావితం చేయగలిగినప్పుడు మన వ్యక్తిగత ఆత్మగౌరమే కాకుండా తప్పు చేసిన వాడు ఎవడైనా గజగజ వణికిపోయే స్థితికి లోనవుతారన్నది వాస్తవమన్నారు. నిజాయితీ కలిగిన జర్మలిస్టులపై మానసిక శారీరక ఆర్థిక దాడులు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం వ్యవస్థలను దోచుకుంటూ వ్యవస్థలను అభాసపాలు చేస్తూ అవినీతి సామ్రాజ్య స్థాపకులు అంతా చిల్లర గుంపులుగా జమై సమాజాన్ని నిజమైన జర్నలిస్టుల ఉనికి లేకుండా చేస్తున్నారని అలాంటి వాళ్లను శిక్షించాల్సిన ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థలు అధికార ముసుగులో ప్రభుత్వ వ్యవస్థలకు అడ్డంకులు వస్తాయేమోనని ఇబ్బందికరంగా వ్యవహరిస్తూ వాళ్లకు అన్ని రకాల మినహాయింపులు కల్పిస్తుండడం వల్లనే నిజమైన జర్నలిజంపై నిలువెత్తు మానసిక దాడులు జరుగుతున్నాయని హెచ్చరించారు. ప్రభుత్వాలు గానీ పోలీస్ అధికారులు గాని జర్నలిజంలో విశ్వాస ఘాతకులంతా బయటి వాళ్లేనని ఎందుకు గుర్తించలేకపోతున్నారంటూ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన జర్నలిస్టులకు గౌరవప్రదమైన హోదాను కల్పించడానికి సంసిద్ధమై ఉంటుండగా రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది. నకిలీ ఉద్యోగులు కొంతమంది నకిలీ అధికారులు కొంతమంది నకిలీ వ్యాపారులు కొంతమంది నకిలీ భూకబ్జాదారులు కొంతమంది రహస్యంగా పత్రిక మీడియా నడిపిస్తున్న ‘కీచకులు” నిజమైన జర్నలిజాన్ని శాసించాలని దుబారా అవస్తులోనికి జర్నలిజాన్ని నెట్టివేయాలని తీవ్రమైన కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు పన్నుతున్నారని వాళ్లందరినీ సమాజ ద్రోహులుగా సమాజంలో కిరాతక శక్తులుగా  పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. తినడానికి తిం లేని స్థితిలో నుండి ఇంచుమించు 100 కోట్ల వరకు సంపాదించిన నకిలీ ముసుగుదారులను పసిగట్టలేని ప్రభుత్వాలు ఆవినీతి సామ్రాజ్యదారుల కుట్రాల్లో ప్రభుత్వ వ్యవస్థలను వదిలేస్తున్నట్లుగా ఉందన్నారు.

జర్నలిజంలో వక్రమార్గం వంకర బుద్ధి..

దినదినానికి దిగజారిపోతున్న జర్నలిజం విలువల కాపాడుకోవాలంటే ముందస్తుగా సోషల్ మీడియా గ్రూపులలో వాట్సప్ గ్రూపులలో ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతూ సమాజంలో రాజకీయ నాయకులుగా చలామణి అవుతూ తప్పుడు పోస్టులను తప్పుడు వీడియోలను వాళ్ళ వాళ్ళ సొంత నెంబర్లతో పాటు నకిలీ ఫోన్ నెంబర్లను సృష్టించుకుని సమాజాని అధోగతి పాలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న కీచకులను పసిగట్టకపోతే అసలైన వంకర బూ కలిగిన నకిలీ గాళ్లు బయటకు రావడం కష్టతరంగా మారిపోతుందన్నారు. సమాజాన్ని సర్వనాశనం చేయాలని సమాలోచనులు చేస్తున్న నకిలీ ముఠాలతో రహస్య సంబంధాలు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్న వ్యక్తులు జర్నలిజం వైపు అడుగులు వేస్తున్నారని అలాంటి నకిలీ ముఠాల కోసం జర్నలిజయి చేయడం సిగ్గుచేటు అన్నారు. నిజమైన జర్నలిజాన్ని చూసి అవినీతిపరుడు 100 మీటర్ల దూరంలో జడుచుకోవాలని అలాంటి జర్నలిజాన్ని కొనసాగించడానికి ఎలాంటి సాహసం అవసరం లేదని కేవలం నిజాయితీగా నిజాన్ని నమ్ముకుని సామాన్య జర్నలిజం చేస్తే అదే మనల్ని ఎంతో ఉన్నతమైన భావాలతో కలిగిన వ్యక్తులంగా సమాజంలో ప్రభావితణ చేస్తుందని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి జర్నలిజంలో ఒక్క అవినీతిపరుడు 100 మంది. జర్నలిస్టులను గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి జర్నలిజం వ్యవస్థ దిగజారి పోతుందని ఒక్క రాజకీయ నాయకుడా వంద మంది జర్నలిస్టులను తన ఇండ్ల చుట్టూ తిప్పుకునే పరిస్థితికి చేరువవుతుందని ఒక ప్రభుత్వ అధికారి జర్నలిస్టులను ప్రలోభాలకు గురిచేస్తూ వాళ్ల అసాంఘిక కార్యకలాపాల నుండి తప్పించుకు తిరుగుతున్నారని గుర్తు చేశారు. అవినీతిని అంతమొందిస్తూ అధికార అరాచక శక్తులను నిలదీస్తూ ఉన్నతమైన భావాలతో జర్నలిజం చేయగల నిజమైన జర్నలిస్టుల కోసం సమాజం జల్లెడ పడుతుందని అలాంటి జర్నలిస్టులు అరుదుగా ఉంటారని వాళ్ళందరూ సమాజంలో నిలదొక్కుకోవడానికి క్లిష్టతరమైన కష్టతరమైన బాధాకరమైన మనోవేదనతో కూడిన దాడులను ఎదుర్కొంటూనే ఉంటున్నారని గుర్తు చేశారు. ఆదర్శవంతమైన జర్నలిజం ఎవరికి భయపడదని ఎవరికి తలొగ్గదని ఎవరికి లొంగదన్న సంగతిని నిరూపించగలగాలంటే నిజాన్ని నిర్భయంగా రాయగలిగినప్పుడే, దానిని చూపించగలిగినప్పుడే జర్నలిజం విలువలు బ్రతికి ఉంటాయని గుర్తు చేశారు. నాయకులను జోకుడు, అధికారులను మెచ్చుకొనుడు,ప్రజా ప్రతినిధుల సొంత మీడియాలో పనిచేస్తూ కేవలం వాళ్ళ రాజకీయ వ్యవస్థను వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కాపాడడం కోసం మాత్రమే జర్నలిజాన్ని కొనసాగిస్తున్న జర్నలిస్టులు ఎంతో మంది ఉన్నారని అలాంటి వాళ్ళడే జర్నలిజంలో పైచేయిగా నడుస్తుందన్నారు. సమాజంలో సోషల్ మీడియా గ్రూపులను వాట్సాప్ గ్రూపులను నిర్మించుకుంటూ నిజమైన సమాచారాన్ని వాస్తవమైన విషయాలను నిర్బంధిస్తూ అరాచక శక్తుల రూపంలో అక్రమాలను అవినీతిని అసాంఘిక శక్తుల రూపాన్ని బయట పెడుతున్న వ్యక్తులను, శక్తులను, కీచకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

అవినీతి ముసుగులో అరాచకచక్తులు..

ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార హోదాలో కొనసాగుతున్న వ్యక్తులందరూ వాళ్ళ అధికార హోదాలలో పెద్ద ఎత్తున అవినీతి ముసుగును ధరించి నిజాయితీ పరులుగా చలామణి కావడం కోసం వ్యక్తిగత సోషల్ మీడియాను వ్యక్తిగత వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకుని కొంతమంది జర్నలిస్టులతో వ్యక్తిగతమైన సన్నిహిత సంబంధం కలుపుకొని అధికార కార్యాలయాల్లో అరాచక శక్తులుగా చలామణి అవుతున్నారని వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వాలు మౌన ప్రదర్శనకు దిగుతున్నాయని తీవ్రంగా దుయ్యపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి ఎంత స్మార్ట్ గా కొనసాగుతుందో తెలియజేయడానికి చక్కని ఉదాహరణగా అవినీతిపరులే అధికార హోదాలలో కొనసాగుతూ ప్రభుత్వ వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తుంటే నిజాయితీపరులైన వ్యక్తులు గాని నిజాయితీపరులైన అధికారులు గాని నిజాయితీపరులైన పోలీసులు గాని నిజాయితీపరులైన జర్నలిస్టులు గాని వాళ్ళ అధికార హోదా ముందు ప్రభావం చూపించలేకపోతున్నారన్నది గమనించదగ్గ విషయం అన్నారు. అంతేకాకుండా అలా అధికార హోదాలో అక్రమంగా కొనసాగుతున్న ఆరాచక శక్తులకు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తూ ప్రభుత్వ అధికార హోదాల్లో కొనసాగించబడుతున్న కార్యక్రమాలలో గాని సమావేశాలలో గాని ముఖ్యమైన సందర్భాల్లో గాని అలాంటి అరాచక శక్తులచే సమాజానికి సందేశాలు ఇప్పించేస్తూ వాళ్ళనే పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుండడం సమాజంలో ఆరాచక శక్తుల బలం పెరిగినట్లుగా కనబడుతుంది అన్నారు. ఇంటి దొంగతో ప్రాణగండం అన్నట్లు ప్రభుత్వ వ్యవస్థలో పనిచేస్తున్న కీచకులతో నకిలీ అరాచక శక్తులతో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ వ్యవస్థలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ఏ ఒక్కరూ పసిగట్టలేక పోతుండడం ప్రభుత్వాల వైఫల్యం అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తుండగా ఎక్కడ కనబడని దోపిడీ అంతా ఒక్కసారిగా విద్యా వ్యవస్థ వైపు మళ్ళి పోతుందని అంతేకాకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థలలో నిధుల సమీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన అరాచక శక్తులు అవినీతి శక్తులుగా అసాంఘిక శక్తులు కరుడుగట్టిన కీచక శక్తులుగా మారిపోయి ఉన్నత అధికారులను బెదిరించుకుంటూ భయపెట్టించుకుంటూ దవాయించుకుంటూ నకిలీ జర్నలిజం ముసుగులో అవినీతి రాబందుల్లా తయారై ప్రభుత్వ ఆర్ధిక నిధులను గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు. రాజకీయ నాయకుల ఆగడాలను సామాన్యులను వేధిస్తున్న పోకడలను ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న విధానాలను అరాచక శక్తుల రూపంలో ప్రభుత్వ అధికార హోదాలను ఉపయోగించుకొని దౌర్జన్యాలకు పాల్పడుతున్న అధికారులను, స్థిరాస్తుల సంపాదన కోసం, స్థిరాస్తుల సంపాదన రక్షణ కోసం మీడియాలను నిర్మించుకొని, దౌర్జన్యాలను సృష్టిస్తూ, నిరంతరం బెదిరిస్తూ సమాజాన్ని అవహేళన చేసే శక్తులను ఎదిరిస్తూ ముక్కు సూటి జర్నలిజాన్ని ప్రదర్శిస్తూ నిలబలగల నిజమైన జర్నలిజం నిరదోక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్నారు. అత్యంత దురాశ అత్యంత దుర్బుద్ధి కలిగిన వ్యక్తులు అధికార హోదాలో అవినీతి అక్రమాలకు పాల్పడి అసాంఘిక శక్తుల హోదాను బలపరుచుకొని జర్నలిజాన్ని అణిచివేస్తున్నారని నిజమైన జర్నలిజం కన్నెర్రజేస్తే ఎంతటి కసాయి శక్తులైన ఎంతటి ఆరాచక శక్తులైనా ఎంతటి కీచక శక్తులైన కనుమరుగైపోక తప్పదన్నది పసిగడుతూ గుర్తించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. రానున్న కాలంలో సమాజం చాలా ప్రమాదకరమైన స్థితిలోనికి నెట్టివేయబడబోతుందని గమనిస్తూ, గుర్తిస్తూ జర్నలిజం విలువలని జర్నలిజాన్ని బతికించుకోవడం కోసం అరాచక శక్తులు ఆగడాలను బయటపెడుతూ అవినీతిపరుల భరతం పడుతూ జర్నలిజాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేసే అసాంఘిక శక్తుల అసలు రూపాలను సమాజానికి తెలియజేస్తూ ఆత్మగౌరవంతో బ్రతకాలని కోరుతూ కడుపునిండా అన్నం.దొరకకపోయినా కునుకునిండా నిద్ర సరిపడకపోయినా జర్నలిజం అంటే జర్నలిజం అనే నిజమైన వ్యక్తిత్వాన్ని నిజమైన సామర్థ్యాన్ని నిజాయితీగా నిష్పక్షపాతంగా ఆదర్శవంతంగా నిర్వహిస్తూ ముందుకు సాగాలని అలాంటి నిజమైన జర్నలిజంలో ఎదుర్కొంటున్న నిందలు అవమానాలు అసమానతలు అణిచివేతలు పోరంబోకుల దాడులు కీచకుల కుట్రలు అధికారుల వేధింపులు అన్ని మన నిజాయితీ ముందు వాళ్లకు తలవంపులు తీసుకొచ్చే విధంగా ఉండాలని అలా ఉన్నతమైన జర్నలిజాన్ని కొనసాగించడం కోసం కోట్ల ప్రజల గొంతుకగా ముందుకు సాగాలని ఆశిద్దాం అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు చేయుత నివ్వాలని జర్నలిస్టుల రక్షణకు న్యాయస్థానాలు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని నిజమైన జర్నలిజాన్ని బ్రతికించుకోవడం కోసం జర్నలిజం పాత చట్టాలను కొత్త చట్టాల రూపంలో పదునైన రక్షణను కల్పించడం కోసం నూతన చట్టాల రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులను బూతులు తిట్టాలంటేనే అరాచక శక్తులకు గుండెలు అదిరిపోయే చట్టాలు రూపొందించబడాలన్నారు.అధికార ముసుగులో అహం, పైన బలువులో మదం, ఆరాచక శక్తుల రూపంలో కిరాతకాలు అణిచివేయబడాలంటే నిజమైన జర్నలిజం పదునెక్కించబడి నిజాయితీగా నిలబడాలని పిలుపునిచ్చారు

– డాక్టర్ బరిగెల శివ

Leave A Reply

Your email address will not be published.

Breaking