యజ్ఞ వరాహస్వామి దేవాలయ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

యజ్ఞ వరాహస్వామి దేవాలయ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ అక్షిత బ్యూరో

కరీంనగర్ నగరంలోని ప్రసిద్ధ యజ్ఞ వరాహస్వామి దేవాలయం లో దేవాలయ వెబ్‌సైట్‌ను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సేవలందించడంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఎంతో ఉపయోగకరమని మేయర్ పేర్కొన్నారు.దేవాలయ వెబ్‌సైట్ ద్వారా భక్తులు ఆలయ కార్యక్రమాలు, పూజా వివరాలు, సేవలు మరియు ఇతర సమాచారాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు,మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, కార్పొరేటర్ తోట అనిల్,దేవాలయ కమిటీ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.దేవాలయ కమిటీ సభ్యులు వెబ్‌సైట్ ప్రారంభించిన మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking