బోనాలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక

బోనాలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక

ఇచ్చోడ గురుకులంలో బోనాల సందడి
ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు
ఇచ్చోడ, అక్షిత న్యూస్ :

బోనాలు సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల (బాలుర) కళాశాల ఇచ్చోడ ప్రిన్సిపల్ నంద సింగ్ ఠాకూర్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల (బాలుర) కళాశాల గురువారం బోనాల పండను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో ఈ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయనీ చెప్పారు. బోనాల యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు క్లుప్తంగా ఆయన వివరిచారు. కళాశాల ఆవరణలో వైభవంగా భక్తి శ్రద్ధలతో బోనాలు వండారు.

కళాశాల ప్రిన్సిపల్తో  పాటు మహిళా ఉపాధ్యాయులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు, పోతరాజుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా రు. ఈ కార్యక్రమంలో ఏటీపీ విజయ, డిడబ్ల్యుఓ దామా, అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking