రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి
నార్కట్ పల్లి, అక్షిత న్యూస్;
నార్కట్ పల్లి గ్రామ శివారులోని ఓల్డ్ వివేరా హోటల్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ ఓడ్లపాటి శాంతి స్వరూప్ 26 మృతి చెందారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గ్రామానికి చెందిన శాంతి స్వరూపు పత్తి పాడు నుంచి హైదరాబాదుకు సర్వికర్రల లోడుతో డిసిఎం వాహనంలో వెళ్తుండగా ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాల మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి వడ్లపాటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్ పల్లి ఎస్ఐ పందిరి విష్ణు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..