బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ అక్షిత బ్యూరో

కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ అమ్మవారికి బోనం ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించుకున్నారు.ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు.బోనాల ఉత్సవాలు సమాజంలో ఐక్యత, సామరస్యం, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని, తెలంగాణ సంస్కృతి పరిరక్షణలో ఈ ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మేయర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు , కార్పొరేటర్లు మాసం గణేష్ , చొప్పరి జయశ్రీ , సౌగాని కొమరయ్య నలువాల రవీందర్ , పొన్నం లక్ష్మీ మొండయ్య గారు, ఇతర ప్రజాప్రతినిధులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking