మొక్కల పెంపకం సమిష్టి బాధ్యత 

మొక్కల పెంపకం సమిష్టి బాధ్యత 

రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి 

కాజిపేట్, అక్షిత ప్రతినిధి :

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సుబేదారి ఎస్ బి హెచ్ కాలనీలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. కాలనీలో వీరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కల పెంపకాన్ని బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ సమతుల్యతను కూడా కాపాడాల్సిన కర్తవ్యం మనందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking