ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
– సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి…
లోకేశ్వరం,అక్టోబర్ 9 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఎ. విజయలక్ష్మి, ఆధ్వర్యంలో అధ్యాపక బృందం ఈ వేడుకలను కన్నులపండువగా ఏర్పాటు చేసింది.కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. తంగేడు, బంతి తదితర రంగురంగుల ప్రకృతి సిద్ధమైన పూలతో బతుకమ్మలను ఎంతో అందంగా పేర్చారు. పసుపుతో చేసిన గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, విద్యార్థినులు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. దీంతో కళాశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.అనంతరం కళాశాల సమీపంలోని భగీరధ చెరువు గట్టు వద్దకు సంబరంగా వెళ్ళి బతుకమ్మలను నిమజ్జనం చేసి వేడుకలను ముగించారు.చదువుతో పాటు మన సంప్రదాయాలను చాటిచెప్పే ఈ వేడుకల్లో అధ్యాపకులు కె.గౌతమ్, జి. విఠల్,ఎన్.వెంకటేశ్వర్లు,కె.వినోద్‌కుమార్,ఎం.ప్రమీలారాణి, జి.శ్రీనివాస్, కె.నవీన్,ఎన్. చిన్నయ్య,డి.మహేందర్,జి. సాయినాథ్, ఎ.హరీష్,బోధనేతర సిబ్బంది కె.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..