కాలేజీ విద్యార్థి ఆత్మహత్య

కాలేజీ విద్యార్థి ఆత్మహత్య

– రామకృష్ణాపూర్‌లో విషాదం.. కేసు నమోదు

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రామకృష్ణపూర్ పట్టణంలోని శ్రీనివాస నగర్, బి-జోన్ ప్రాంతానికి చెందిన కాంపెల్లి మున్నా (19) అనే కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. జమ్మికుంటలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్న మున్నా ఈ నెల 8న ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking