రామకృష్ణాపూర్‌లో వాహన తనిఖీలు

రామకృష్ణాపూర్‌లో వాహన తనిఖీలు

– ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: ఎస్‌ఐ శ్రీధర్

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పట్టణ పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారుల వివరాలు, వాహన పత్రాలను పరిశీలించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని పోలీసులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking