పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
– ఏడాదికి సరిపడా సబ్బులు, కొబ్బరి నూనె పంపిణీ
మందమర్రి, అక్షిత ప్రతినిధి:
పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఏడాదికి సరిపడా సబ్బులు, కొబ్బరి నూనెను మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.మున్సిపల్ చైర్‌పర్సన్ గొడిసెల సంధ్యారాణి, కమిషనర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సునీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో కార్మికులు తమ ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. ఏడాదికి సరిపడా సామగ్రిని పంపిణీ చేసినందుకు కార్మికులు మున్సిపల్ పాలకవర్గానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.