బాధితులను పరామర్శించిన హరీష్ రావు

నిమ్స్‌లో బాధిత మహిళలను పరామర్శించిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వైఫల్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ లైసెన్స్‌ రద్దు, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ను సస్పెండ్‌ చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బుధవారం మంత్రి హరీశ్‌రావు నిమ్స్‌లో బాధిత మహిళలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ఆరేండ్లలో పన్నెండు లక్షల ఆపరేషన్లు చేశాం. ఎలాంటి సమస్య రాలేదన్నారు. ఆపరేషన్లు చేయించుకున్న 30 మంది క్షేమంగా ఉన్నారు. ఇవాళ కొంతమందిని, రేపు కొంతమందిని వైద్యులు డిశ్చార్జు చేస్తారన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కమిటీ వేశామన్నారు.
కాగా, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్‌లో ఈ నెల25న 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking