గురునానక్ అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తా

** గురునాన‌క్ గ్రూప్ ఆఫ్ ఇన్సిట్యూష‌న్  విద్యా సంస్థ గురించి హెచ్ఎండిఏ అధికారుల‌కు ఫిర్యాదు చేస్తా

ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ యూసుఫ్

రంగారెడ్డి, అక్షిత ప్ర‌తినిధి  : గురునాన‌క్ గ్రూఫ్ ఆఫ్ ఇన్సిట్యూష‌న్ లో  అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై హెచ్ఎండిఏ
అధికారులకు ఫిర్యాదు చేస్తాన‌ని , పూర్తి నివేదిక తెప్పించుకోని క‌ళాశాలపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని  ఇబ్ర‌హీంప‌ట్నం  మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ యూసుఫ్ తెలిపారు. ఆయ‌న శ‌నివారం  రోజు అక్షిత ప్ర‌తినిధితో మాట్లాడుతూ గురునాన‌క్ గ్రూప్ ఆప్ ఇన్సిట్యూష‌న్ లో నిర్మాణాలు జ‌రుగుతున్న విష‌యంవాస్త‌వ‌మేన‌ని పూర్తి వివ‌రాలు  పంపిస్తాన‌ని క‌ళాశాల య‌జ‌మాన్యం
స‌రిగ్గా పంప‌డం లేద‌ని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారిని క‌ళాశాల‌కు పంపించి పూర్తి నివేదిక‌ను తెప్పిస్తాన‌ని  తెలిపారు. హెచ్ఎండిఎ అధికారుల
నుంచి ఎన్ని అనుమ‌తులు ఉన్నాయ‌ని పూర్తి వివ‌రాల‌ను సేక‌రిస్తామ‌ని అందుకోసం వారికి లిఖిత పూర్వ‌కంగా లేఖ‌ను పంపిస్తాన‌ని  తెలిపారు. రీఅసిస్మెంట్  కోసం ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిపాలిటీలో  కౌన్సిల్ తీర్మానంచేయాల్సి ఉంటుంద‌ని , కౌన్సిల్ తీర్మానం త‌ర్వాత   గురునాన‌క్ గ్రూప్ ఆఫ్లో ఉన్న అన్ని భ‌వ‌నాలు రీ అసిస్మెంట్ చేస్తామ‌ని  తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking